Politics16th Nov 03:03 PMSunil Byrisetty1 min read
పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలాా?
ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్‌ను తరలిస్తున్న వారిని అడ్డుకున్నందుకు అభ్యర్థులను అభినందించాల్సింది పోయి, అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని 10 రోజులుగా జైలులో పెట్టడం దు
ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్‌ను తరలిస్తున్న వారిని అడ్డుకున్నందుకు అభ్యర్థులను అభినందించాల్సింది పోయి, అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని 10 రోజులుగా జైలులో పెట్టడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది మామూలు తప్పుడు కేసు కాదు.. ఇంత అన్యాయమైన కేసు ఎప్పుడూ చూసి ఉండమని వ్యాఖ్యానించారు. బ్యాలెట్ బాక్స్‌ను ఎక్కడికో తీసుకెళ్తుంటే అడ్డుకుని మళ్లీ అధికారులకు అప్పగించే ప్రయత్నం మాత్రమే తమ నాయకులు, కార్యకర్తలు చేశారన్నారు. దోషులను వదిలేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారిపై కేసులు పెడతారా అనడిగారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ఎన్నికల నిర్వహణ బాధ్యతను పోలీసులకు కాంట్రాక్టు ఇచ్చినట్టున్నారని విమర్శించారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేక పోలీసులకు పీపీసీ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చేశారన్నారు. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు తెచ్చుకోవాలని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజల దగ్గరకు వెళ్లలేక పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరుపుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.