Politics29th May 12:00 PMSunil Byrisetty1 min read
వెన్నుపోటు దినం.. విజయవంతానికి సజ్జల పిలుపు
జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిరసన కార
జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిరసన కార్యక్రమమని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని 'వెన్నుపోటు దినం'గా నిర్వహించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని సజ్జల తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని సజ్జల సూచించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.