Politics10th Jan 03:18 PMSunil Byrisetty1 min read
సజ్జలది వార్డు మెంబర్ స్థాయి
పార్టీలో ఎలాంటి హోదా లేని, ప్రజల్లో కనీస ఆమోదం కూడా లేని వార్డు మెంబర్ స్థాయి నేత సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ విధానాలు, శాసనసభ, పార్లమెంట్ అంశాలపై మాట్లాడటం సిగ్గుచేటు అని తెలుగ
పార్టీలో ఎలాంటి హోదా లేని, ప్రజల్లో కనీస ఆమోదం కూడా లేని వార్డు మెంబర్ స్థాయి నేత సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ విధానాలు, శాసనసభ, పార్లమెంట్ అంశాలపై మాట్లాడటం సిగ్గుచేటు అని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటి నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ రాజధాని అమరావతి గురించి వైసీపీ కార్యాలయం నుంచి సజ్జల ప్రెస్‌మీట్ పెట్టారు.. అయితే ఏ హోదాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్ కూడా కానీ వ్యక్తి ప్రభుత్వ విధానాలపై మాట్లాడటం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయో ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజలు తిరస్కరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండి తన మాజీ సలహాదారుడి ద్వారా మాట్లాడిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోనే సజ్జలపై వ్యతిరేకత ఉందని, ఆయన వల్లే గత ప్రభుత్వం నాశనం అయిందని వైసీపీ నేతలే బయట చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రధాన సలహాదారుడిగా ఉన్న సమయంలో సజ్జల ఇచ్చిన సూచనల ఫలితంగానే వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని బీటీ నాయుడు విమర్శించారు.