Politics10th Oct 04:56 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికలపై సజ్జల కీలక సూచనలు

స్థానిక ఎన్నికలకు లీగల్ సెల్ సిద్ధం కావాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. పార్టీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలన్నారు. లీగల్

స్థానిక ఎన్నికలపై సజ్జల కీలక సూచనలు
స్థానిక ఎన్నికలకు లీగల్ సెల్ సిద్ధం కావాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. పార్టీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలన్నారు. లీగల్ టాస్క్ ఫోర్స్, వార్ రూమ్‍లు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు న్యాయపరంగా అభ్యర్థులకు అండగా ఉండాలని సూచించారు. SIR కొత్త ఓటర్ల జాబితా రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం తొందరపడుతోందంటూ వ్యాఖ్యానించారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారిని జాబితాలో చేర్చకుండా ఎన్నికలు నిర్వహించటం రాజ్యాంగ విరుద్దమని చెప్పారు. నామినేషన్ దశ నుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని, కనుక ముందుగానే అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేయించాలని సజ్జల సూచనలు చేశారు.
Scroll for the next article