Politics31st May 04:20 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో రెడ్‌బుక్ పాల‌న: స‌జ్జల

నెల్లూరు సెంట్రల్ జైల్ లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం వైయ‌స్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ స‌జ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వాన్ని ప్ర

రాష్ట్రంలో రెడ్‌బుక్ పాల‌న: స‌జ్జల
నెల్లూరు సెంట్రల్ జైల్ లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం వైయ‌స్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ స‌జ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నందుకే కాకాణి అక్ర‌మ అరెస్టని అభిప్రాయపడ్డారు. పెనాల్టీతో పోయే కేసుల‌ను నాన్‌బెయిల‌బుల్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయ‌కుల‌పై న‌మోదైన ఏ కేసుల్లోనూ ఆధారాలే లేవని, అలాంటి త‌ప్పుడు కేసుల ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన పరాకాష్టకు చేరిందని, ఏడాది పాలనకే కూటమి ప్రభుత్వానికి ప్రజలు పాడెకట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.
AndhraPradesh
APPolitics
nellore central jail
YSRCP
YSJagan
sajjala Ramakrishna reddy
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాల‌న
Scroll for the next article