Politics13th Jul 03:57 PMSunil Byrisetty1 min read
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చి
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వర రావును పరామర్శించారు. ప్రజాస్వామ్య పాలన బదులు రాష్ట్రంలో పోలీస్ రాజ్యం సాగుతోందన్నారు. తమ సమక్షంలోనే వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేస్తే... వాటిని బుట్టదాఖలు చేసి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేస్తున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం, పొగాకు, మిర్చి, మామిడి ఏ రైతుకూ గిట్టుబాటుధర లేక ఆందోళనలో ఉన్న అన్నదాతలను జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే... అప్పుడు హడావుడిగా ఢిల్లీకి లేఖలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను మీరు తీరిస్తే.. వారిని వైయస్సార్సీపీ, జగన్మోహన్ రెడ్డి పరామర్శించే అవసరం రాదు కదా ప్రభుత్వాన్ని నిలదీశారు.