Politics8th Mar 11:51 AMSunil Byrisetty1 min read

యువత పోరుతో సత్తా చాటాలి: సజ్జల

రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం... ఈ విషయంలో తక్షణమే స్పందించాలని, ఆయా వర్గాల తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 12వ

యువత పోరుతో సత్తా చాటాలి: సజ్జల
రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం... ఈ విషయంలో తక్షణమే స్పందించాలని, ఆయా వర్గాల తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన యువత పోరు కార్యక్రమ ర్యాలీలు, జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ‘కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. ఆ తర్వాత విద్యుత్‌ ఛార్జీలపై చేసిన కార్యక్రమం కూడా అదే స్ధాయిలో విజయవంతం అయింది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ మూడో కార్యక్రమాన్ని (యువత పోరు) కూడా విజయవంతం చేయాల’ని సజ్జల పిలుపునిచ్చారు.
YCP
Sajjala Ramakrishna Reddy
వైసీపీ
సజ్జల రామకృష్ణారెడ్డి
Scroll for the next article