Politics28th Jul 12:34 PMSunil Byrisetty1 min read
సజ్జల చెప్పిన ఓటర్లు గల్లంతు !
వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఒకసారి తమ ఓటర్లు వేరే అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పిన ఓటర్లు ఇప్పుడు గల్లంతవుతున్నారు. ముఖ్యంగా రాయలస
వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఒకసారి తమ ఓటర్లు వేరే అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పిన ఓటర్లు ఇప్పుడు గల్లంతవుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో ఎస్ఐఆర్ ప్రక్రియలో నకిలీ ఓటర్లంతా ఎగిరిపోతున్నారట. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,95,288 ఓటర్లు ఉండగా, దాదాపు 90,882 అంటే 30.77% ఓట్లను తొలగించాల్సిన జాబితాలో చేర్చారు. కర్నూలు జిల్లాలో SIR ప్రక్రియ ప్రారంభంలో 20,86,119 ఓటర్లు ఉండగా, ఎన్యుమరేషన్ ఫారాలు అదృశ్యం లేదా వెనక్కి రాకపోవడం ద్వారా 2,73,922 ఓట్లలో మరణాలు, వలసలు, డూప్లికేట్లు ఉన్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన తొలగించాల్సిన ఓట్లలో సుమారు 30 శాతం ఓట్లు నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల పరిధిలోనే నమోదయ్యాయి.