News4th Apr 02:22 PMSunil Byrisetty1 min read

గుంటూరులో “సఖి నివాస్” ప్రారంభం.. మహిళా హాస్టల్

గుంటూరులో ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ సఖి నివాస్ ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 100 మంది మహిళలు రక్షణగా ఉండగల

గుంటూరులో “సఖి నివాస్” ప్రారంభం.. మహిళా హాస్టల్
గుంటూరులో ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ సఖి నివాస్ ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 100 మంది మహిళలు రక్షణగా ఉండగలిగే మహిళా హాస్టల్ ఇదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానం ప్రకారం మహిళా రక్షణ కోసం రూ. 2 కోట్లతో నిర్మించిన భవనమని తెలిపారు. అన్నిరకాల మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం వర్కింగ్ ఉమెన్‌కు అనుకూలంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మరిన్ని భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన చోట్ల సఖి నివాస్‌లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Sakhi Niwas
Guntur
Women’s hostel
ముఖ్యమంత్రి చంద్రబాబు
గుమ్మిడి సంధ్యారాణి
Scroll for the next article