Mobiles15th Jun 12:27 PMSunil Byrisetty1 min read
కొత్త శాంసంగ్ గెలాక్సీ M36.. లీకైన వివరాలివే!
టెక్ దిగ్గజం శాంసంగ్ కొత్త ఫోన్‌తో వస్తోంది. గెలాక్సీ M36 అతి త్వరలో లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన గెలాక్సీ M35 ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. లీకైన వివరాల
టెక్ దిగ్గజం శాంసంగ్ కొత్త ఫోన్‌తో వస్తోంది. గెలాక్సీ M36 అతి త్వరలో లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన గెలాక్సీ M35 ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. లీకైన వివరాల ప్రకారం జూలైలో ఈ మొబైల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ 5G ఫోన్ 1080×2340 రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1500 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ ఉండొచ్చు. OISతో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ 16MP సెన్సార్‌తో రానుంది. ఎక్సినోస్ 1380 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో, 8GB ర్యామ్, 128GB స్టోరేజీ కలిగి ఉంటుందని సమాచారం. స్టోరేజీని మరింత పెంచుకోవడానికి SD కార్డ్ ఆప్షన్ కూడా ఉండొచ్చని అంచనా. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత కస్టమ్ యూఐలో రన్ అవుతుంది. టైప్-C USB కనెక్టర్, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉండొచ్చు. శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ ధర రూ.25వేల లోపు ధర ఉండొచ్చు.