Mobiles29th Jun 11:50 AMSunil Byrisetty1 min read
శామ్‌సంగ్ నుంచి ఫోల్డ్!
యువతలో మడత ఫోన్లకు(ఫోల్డ్) పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్లు కంపెనీలు సిద్ధమయ్యాయి. తాజాగా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్
యువతలో మడత ఫోన్లకు(ఫోల్డ్) పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్లు కంపెనీలు సిద్ధమయ్యాయి. తాజాగా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌లో జడ్ ఫోల్డ్ 5 మోడల్ తెచ్చింది. గతంలో వచ్చిన ఫోల్డింగ్ గెలాక్సీ మోడల్‌లోని లోపాలు సరిదిద్ది, ఈ స్టైలిష్ ఫోన్‌ని తీసుకొచ్చారు. వాడుతుంటే పర్సనల్ కంప్యూటర్ అనుభూతి కలగడం ఖాయమంటోంది తయారీదారు. స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 సీపీయూ ప్రాసెసర్, 7.6 అంగుళాల పరిమాణం, వెనక 12+50+10 మెగా పిక్సెళ్ల కెమెరా, ముందు 4+10 కెమెరా ఉన్నాయి. 256జీబీ నుంచి 1టీబీ వరకు భారీ స్టోరేజీ ఉంది. బరువు 253 గ్రాములతో కాస్త ఎక్కువైనా ఫీచర్లు అదరగొడుతున్నాయి. దీని ధర రూ. 1,64,999గా ఉంది.