Mobiles5th Jan 01:13 PMSunil Byrisetty1 min read

త్వరలో Samsung ప్రీమియం స్మార్ట్ ఫోన్

సౌత్ కొరియాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన శాంసంగ్, తమ సరికొత్త ప్రీమియం 5G స్మార్ట్ ఫోన్ అయిన Samsung Galaxy S26 Plus స్మార్ట్ ఫోన్ ని త్వరలో భారత మార్కెట్ లోకి విడుదల

త్వరలో Samsung ప్రీమియం స్మార్ట్ ఫోన్
సౌత్ కొరియాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన శాంసంగ్, తమ సరికొత్త ప్రీమియం 5G స్మార్ట్ ఫోన్ అయిన Samsung Galaxy S26 Plus స్మార్ట్ ఫోన్ ని త్వరలో భారత మార్కెట్ లోకి విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, జనవరి లేదా ఫిబ్రవరి నెలలలో విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు లీకుల ద్వారా తెలుస్తుంది. మరొకవైపు ఇది Samsung Galaxy S26 సిరీస్ నుంచి వస్తున్న ఫోన్ అవ్వడం విశేషం. వీటి ప్రకారం, Samsung Galaxy S26 Plus స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పాటు 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే, ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే ప్రారంభ వేరియంట్ తో విడుదల అయ్యే అవకాశం ఉందని, అలాగే దీని ధర సుమారు రూ. 95,000 నుంచి రూ. 1,05,999 మధ్య ఉండొచ్చు.
Smart phone
Samsung Galaxy S26 Plus
Samsung Premium Smartphone
Samsung 5G Phone
Galaxy S26 Series
Snapdragon 8 Elite Gen 5
Samsung India Launch
Scroll for the next article