Electronics25th May 01:35 PMSunil Byrisetty1 min read

శాంసంగ్ ట్రై ఫోల్డ్.. ఇది ఫోనా.. ఖర్చీఫా!?

ప్రముఖ దిగ్గజ కంపెనీ శాంసంగ్ సరికొత్త ట్రై ఫోల్డ్ ఆవిష్కరణను తీసుకొస్తోంది. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్ సంస్థలు ఫోల్డ్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చాయి. యాపిల్ సైతం రంగంలోకి దిగి పరిశో

శాంసంగ్ ట్రై ఫోల్డ్.. ఇది ఫోనా.. ఖర్చీఫా!?
ప్రముఖ దిగ్గజ కంపెనీ శాంసంగ్ సరికొత్త ట్రై ఫోల్డ్ ఆవిష్కరణను తీసుకొస్తోంది. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్ సంస్థలు ఫోల్డ్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చాయి. యాపిల్ సైతం రంగంలోకి దిగి పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లకు భిన్నంగా ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌లోనే విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ ట్రై ఫోల్డ్ ఫోన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మడతలు పెట్టొచ్చు. ప్రస్తుతం ఉన్న శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లతో పోలిస్తే ట్రిపుల్ ఫోల్డ్ భిన్నంగా ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో డ్యుయెల్ హింజ్ మెకానిజం ఉంటుందట. ఆంగ్ల అక్షరం జెడ్ ఆకారంలో తెరుచుకుని, డిస్‌ప్లే ఏరియా మరింత పెద్దగా మారుతుందని చెబుతున్నారు. మూడు హింజ్‌లు ఉన్న డిజైన్‌లకు కూడా శాంసంగ్ గతంలోనే పేటెంట్ దరఖాస్తు చేసుకుంది. ఒకేసారి నాలుగు డిస్‌ప్లే పానల్స్ అనుసంధానం చేసేందుకు ఈ డిజైన్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌ను పూర్తిగా తెరిస్తే ఓ టాబ్లెట్ అంత సైజు ఉండొచ్చని అంచనా. ఈ మొబైల్ ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
Samsung triple-fold smartphone
Samsung Galaxy G-Fold
శాంసంగ్ సరికొత్త ట్రై ఫోల్డ్ ఆవిష్కరణ
ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌
నాలుగు డిస్‌ప్లే పానల్స్
Scroll for the next article