Telangana20th Sep 05:08 PMSunil Byrisetty1 min read
వరంగల్ ఎయిర్పోర్తుకు యానిమల్ డైరెక్టర్ పేరు!
వరంగల్ ఎయిర్పోర్టు కొత్తగా నిర్మిస్తున్న నేపథ్యంలో పేర్లు సూచించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై ప్రముఖ సినీ దర్శకుడు.. ఓరుగల్లు ముద్దుబిడ్డ సందీప్ రెడ్డి వంగ స్పందించారు. కాకతీయ రాజ
వరంగల్ ఎయిర్పోర్టు కొత్తగా నిర్మిస్తున్న నేపథ్యంలో పేర్లు సూచించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై ప్రముఖ సినీ దర్శకుడు.. ఓరుగల్లు ముద్దుబిడ్డ సందీప్ రెడ్డి వంగ స్పందించారు.
కాకతీయ రాజుల ముద్దుబిడ్డ రాణి రుద్రమదేవిని స్మరించుకునేలా- రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఒక పేరు సూచించారు. అలాగే
కాకతీయ రాజుల పరాక్రమాన్ని తెలియజేసేలా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టొచ్చని సూచనలు చేశారు. ఈ రెండు పేర్లను సందీప్ సూచించదంపై "దట్ ఈస్ ది స్పిరిట్" అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
'సందీప్ - ప్రభాస్' ప్రాజెక్ట్ స్పిరిట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న నేపథ్యంలో 'స్పిరిట్' పదాన్ని ప్రస్తావిస్తూ సందీప్ సీఎంకు థాంక్స్ చెప్పారు. అలాగే పలువురు ప్రముఖులు కాళోజీ పేరు పెట్టొచ్చని, భద్రకాళి ఆలయాన్ని స్ఫురింపచేసేలా అమ్మవారు 'భద్రకాళి ఎయిర్ పోర్టు' అని పెట్టాలని సూచిస్తున్నారు.