News3rd Aug 04:22 PMSunil Byrisetty1 min read
నదీ గర్భంలోకి సంగమేశ్వర ఆలయం
కృష్ణా నదిలో నీటి మట్టం పెరిగినప్పుడు మునిగిపోయి, తగ్గినప్పుడు కనిపించే సంగమేశ్వరాలయం మళ్లీ నదీ గర్భంలోకి వెళుతోంది. సోమశిల,శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్స్‌లో ఉన్న సంగమేశ్వరం దే
కృష్ణా నదిలో నీటి మట్టం పెరిగినప్పుడు మునిగిపోయి, తగ్గినప్పుడు కనిపించే సంగమేశ్వరాలయం మళ్లీ నదీ గర్భంలోకి వెళుతోంది. సోమశిల,శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్స్‌లో ఉన్న సంగమేశ్వరం దేవాలయం మళ్లీ జలాధివాసానికి చేరువవుతోంది.ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్లో నీటి మట్టం 849.6 అడుగులు ఉంది.నీటి మట్టం 841 అడుగులకు చేరగానే ఆలయ గర్భగుడిలోకి నీరు ప్రవేశిస్తుంది.867 అడుగులకు చేరితే ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. దీంతో భక్తులకు స్వామివారి దర్శనం నిలిచిపోనుండగా సుమారు 8 నెలల తర్వాత నీటి మట్టం తగ్గిన అనంతరం మాత్రమే మళ్లీ దర్శనం లభించే అవకాశం ఉంది.ప్రతి ఏడాది కొన్ని నెలలు నీటిలో మునిగిపోవడం ఈ ఆలయం ప్రత్యేకత.