News18th Jul 04:25 PMSunil Byrisetty1 min read

వారికీ 'తల్లికి వందనం'.. బాబుకు పాలాభిషేకం!

యువ గళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేస్తూ పారిశుద్ధ్య కార్మికులకు అంగన్వాడీలకు 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్న టీఎన్టీయూస

వారికీ 'తల్లికి వందనం'.. బాబుకు పాలాభిషేకం!
యువ గళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేస్తూ పారిశుద్ధ్య కార్మికులకు అంగన్వాడీలకు 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్న టీఎన్టీయూసీ నేత గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. గత ప్రభుత్వం చేసిన హౌస్ మ్యాపింగ్ సర్వే లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేయడం జరిగింది. దీని వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా పోయాయి. మంత్రి నారా లోకేష్ చొరవతో పారిశుద్ధ్య కార్మికుల, అంగన్వాడీల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరడం సంతోషకరమని అన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది పారిశుద్ధ్య కార్మికులకు, అంగన్‌వాడీ కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించడంతో పాటు, వారి పిల్లల విద్యకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. సీఎం, మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Andhra Pradesh
Talliki Vandanam
Chandrababu Naidu
Nara Lokesh
Sanitation Workers
Anganwadi
సంక్షేమ పథకం
టీఎన్టీయూసీ
గొట్టుముక్కల రఘురామరాజు
యువగళం
Scroll for the next article