Politics9th Apr 08:59 AMSunil Byrisetty1 min read
2029లో పులివెందుల మాదేనన్న టీడీపీ మంత్రి
2029 ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ విజయం సాధించడం తథ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కుండ బద్దలు కొట్టారు, రానున్న స్థానిక సంస్థల్లోనూ పసుపు జెండా
2029 ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ విజయం సాధించడం తథ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కుండ బద్దలు కొట్టారు, రానున్న స్థానిక సంస్థల్లోనూ పసుపు జెండా రెపరెపలు ఖాయమన్నారు.
పులివెందులలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల నియోజక వర్గ స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
పులివెందుల టీడీపీ కార్యకర్తల పోరాటం తిరుగులేనిదన్నారు.
2019 ఎన్నికల్లో ఒక్కసారి ఛాన్స్ అంటూ బ్రతిమాలిడిన జగన్‌కు పులివెందులలో 93 వేల మెజార్టీ వస్తే... 2024 నాటికి 60 వేలకు తగ్గిపోయిందన్నారు.
ఈ మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారెందరికో వచ్చిందన్నారు. 2029 ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.
తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం లేదని, అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు.
పార్టీలకతీతంగా కాంట్రాక్టర్లందరూ బిల్లులు చెల్లించామన్నారు.
2019 తరవాత అధికారంలోకి వచ్చిన జగన్ ...టీడీపీ నాయకులు, సానుభూతి పరులు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదన్నారు.