News26th Aug 03:03 PMSunil Byrisetty1 min read

జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’

వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల

జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’
వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ‘సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సీఎం సూచించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం ‘సంజీవని ప్రాజెక్ట్’పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబం విద్యకు, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని.. ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలను తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్యారోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు.
Andhra Pradesh
Sanjeevani Project
Chandrababu Naidu
Healthcare
Digital Health Records
Health Services
Medical Services
చిత్తూరు జిల్లా
వైద్య రంగంలో ఆవిష్కరణలు
టాటా ఎండీ
ప్రజారోగ్యం
డిజిటల్ హెల్త్‌కేర్
ఏపీ న్యూస్
Scroll for the next article