News18th Sep 05:04 PMSunil Byrisetty1 min read

'సంజీవని'తో 'ఇంటింటికీ యోగా'

'సంజీవని' కార్యక్రమంతో 'ఇంటింటికీ యోగా'ను అనుసంధానం చేయబోతున్నామని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సంజీవని ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలతోపాటు యోగా, ధ్యానం, ప

'సంజీవని'తో 'ఇంటింటికీ యోగా'
'సంజీవని' కార్యక్రమంతో 'ఇంటింటికీ యోగా'ను అనుసంధానం చేయబోతున్నామని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సంజీవని ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలతోపాటు యోగా, ధ్యానం, ప్రాణామాయాలు, ఆరోగ్యకర జీవన విధానంతో కూడిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తామ‌న్నారు. 'ఇంటింటికి యోగా' కార్యక్రమంలో సంజీవని కార్యక్రమాలు అనుసంధానం చేయడం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను ప్రజల వద్దకు సులువుగా తీసుకువెళ్లేందుకు వీలుంటుంద‌ని చెప్పారు. విజ‌య‌వాడ నుంచి ఏపీ స‌చివాల‌యానికి వెళ్లే కరకట్టకు ఆనుకొని ఉన్న మంతెన స‌త్య‌నారాయ‌ణ రాజు ఆశ్రమంలో 'ఇంటింటికీ యోగా-సంజీవ‌ని ప్రాజెక్టు-ఆయుష్ సేవ‌ల అనుసంధానం భాగ‌స్వామ్య సంస్థ‌ల స‌హ‌కారంపై' జ‌రిగిన స‌ద‌స్సుకు విచ్చేసిన మంత్రి మాట్లాడారు. ప్ర‌తి ఇంటిలో యోగా-ఆరోగ్యక‌ర కుటుంబం-ఆరోగ్య‌క‌ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర్మాణ‌మే కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. రాష్ట్రంలో సంజీవ‌ని కార్య‌క్ర‌మం అమ‌లు అనుస‌ర‌ణీయ‌మ‌ని కేంద్రం ప్ర‌శంసింద‌ని, అదేవిధంగా ఇంటింటి యోగా కార్య‌క్ర‌మాన్ని కూడా ప‌టిష్టంగా నిర్వ‌హించేందుకు భాగ‌స్వామ్య సంస్థ‌లు చేయూత‌నందించాల‌ని కోరారు.
Scroll for the next article