News13th Jan 12:47 PMSunil Byrisetty1 min read
ఉద్యోగుల్లో సంక్రాంతి సంబరం!
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు పండుగ వార్త అందించింది. సంక్రాంతి కానుకనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డీఏ, డీఆర్ ఎరియర్స్, పెండింగ్ బిల్లులు
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు పండుగ వార్త అందించింది. సంక్రాంతి కానుకనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డీఏ, డీఆర్ ఎరియర్స్, పెండింగ్ బిల్లులు, బకాయిల క్లియరెన్స్ కోసం రూ. 2,653 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో సీపీఎస్ ఉద్యోగుల్లో 2.25 లక్షల మంది, పెన్షనర్లలో 2.70 లక్షల మంది నేరుగా లబ్ధి పొందుతారు. పోలీస్ సిబ్బందికి కూడా సరెండర్ లీవుల బకాయిల కోసం రూ. 110 కోట్లు మంజూరు చేశారు. దీనివల్ల దాదాపు 55 వేల మంది పోలీసులకు ప్రయోజనం కలగనుంది. కాంట్రాక్టర్లకు సంబంధించి ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ వంటి ప్రాజెక్టుల కింద చేసిన పనుల బిల్లులకు రూ. 1,243 కోట్లు విడుదల చేసింది. అందులోనే 'నీరు-చెట్టు' పథకం బిల్లులకు సుమారు రూ. 40 కోట్లు కేటాయించారు.