News4th Jan 04:24 PMSunil Byrisetty1 min read

సంక్రాంతి డిమాండ్.. ప్రైవేట్ ట్రావెల్స్ మోత!

ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీల మోత మోగిస్తున్నాయి. సంక్రాంతి సందడి ప్రారంభం కావడంతో దోపిడీకి తెరతీస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాదు నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది.

సంక్రాంతి డిమాండ్.. ప్రైవేట్ ట్రావెల్స్ మోత!
ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీల మోత మోగిస్తున్నాయి. సంక్రాంతి సందడి ప్రారంభం కావడంతో దోపిడీకి తెరతీస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాదు నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది. కానీ, ప్రస్తుతం కొన్ని ఏజెన్సీలు రూ.2,700 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ట్రైన్ రిజర్వేషన్లు దొరకకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు సీటును బట్టి ధరలు పెంచుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Sankranti Travel
Private Bus Operators
Fare Hike
Passenger Complaints
పండుగ రద్దీ
టికెట్ ధరల పెంపు
ప్రభుత్వ జోక్యం
Scroll for the next article