News15th Jan 03:32 PMSunil Byrisetty1 min read
వృద్ధులకు సంక్రాంతి పిండి వంటలు
పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధుల ఆశ్రమంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక కాపు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు ఆధ్వర్య
పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధుల ఆశ్రమంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక కాపు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు ఆధ్వర్యంలో గురువారం వృద్ధులకు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేశారు. అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, చెక్కలు, బూరెలు, బొబ్బట్లు పంపిణీ చేశారు. అనంతరం కృష్ణారావు నాయుడు మాట్లాడారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులు గతంలో ఎన్నో పిండి వంటలు చేసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు పెట్టి ఆనందోత్సవాలతో సంక్రాంతి పండుగను జరుపుకొని ఉండేవారన్నారు. నేడు కొన్ని పరిస్థితుల వలన శరణాలయంలో ఉన్న వీరికి నాటి స్మృతులు గుర్తుకు తెచ్చుకొని బాధపడకూడదని ఉద్దేశంతో వృద్ధులు కూడా సంక్రాంతి పిండి వంటలు తిని ఆనందోత్సవాలతో పండుగ అనుభూతిని పొందాలని పిండి వంటలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్, ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్, బాపనపల్లి యశ్వంత్ బాబు తదితరులు పాల్గొన్నారు.