News7th Oct 02:18 PMSunil Byrisetty1 min read

సరస్, దసరా, విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త శోభ

రానున్న పది రోజుల్లో విజయవాడ నగరం పండుగల వేదికగా మారనుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళా, దసరా శరన్నవరాత్రి ఉ

సరస్, దసరా, విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త శోభ
రానున్న పది రోజుల్లో విజయవాడ నగరం పండుగల వేదికగా మారనుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్–2.0 ఒకే సమయంలో జరగడం విజయవాడ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని తెలిపారు. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత విజయవాడలో సరస్ మేళా నిర్వహించడం గర్వకారణమని ఎంపీ అన్నారు. ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు పున్నమి ఘాట్‌లోని సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో సరస్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో సుమారు 650 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 2,500 మంది ప్రతినిధులు సరస్ మేళాలో పాల్గొననున్నారని వివరించారు. స్టాళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Scroll for the next article