News16th Aug 03:42 PMSunil Byrisetty1 min read
సర్ధార్ లచ్చన్న జీవితం ఆదర్శం
ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో సర్దార్ గౌతు లచ్చన్న జీవితాన్ని చదివితే సరిపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన
ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో సర్దార్ గౌతు లచ్చన్న జీవితాన్ని చదివితే సరిపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న 117 జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. లచ్చన్న విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. స్వార్ధ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని నినదించిన ఘనత సర్దార్ గౌతు లచ్చన్న గారెకే సొంతమని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన గౌతు లచ్చన్న నాటి స్వతంత్ర మహా సంగ్రామంలో అత్యంత కీలకంగా ఎదిగారని గుర్తు చేశారు. తన పోరాటాలు, పట్టుదలతో సర్దార్ బిరుదు పొందారని ప్రశంసించారు.