News17th Jun 04:50 PMSunil Byrisetty1 min read
గోరంట్లలో జవాను మురళీ నాయక్ కాంస్యం విగ్రహం
దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్‌లో వీర మరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గ
దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్‌లో వీర మరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ తల్లిదండ్రులను మంత్రి సవిత పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల చెక్కును, అయిదెకరాల స్థలాన్ని, ఆరు సెంట్ల ఇళ్ల స్థలం పట్టాలను మురళీ తల్లిదండ్రులకు అందజేశారు. ప్రజలతో పాటు కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని వీర జవాను తల్లిదండ్రులను ఓదార్చారు. ఏ కష్టం వచ్చినా తనను సంప్రదిస్తే వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చారు. గోరంట్లతో పాటు జిల్లా కేంద్రంలో కూడా మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.