News23rd Jul 09:41 AMSunil Byrisetty1 min read
నాటి సాయం.. నేడు విద్యా దీపం..!
నాడు ప్రభుత్వ సాయంతో ఉన్నత విద్యానభ్యసించాడు. నేడు సాయం చేసి విద్యార్థులకు తోడ్పాటునందించేందుకు ముందడుగేశాడు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ
నాడు ప్రభుత్వ సాయంతో ఉన్నత విద్యానభ్యసించాడు. నేడు సాయం చేసి విద్యార్థులకు తోడ్పాటునందించేందుకు ముందడుగేశాడు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆ పథకాలతో లబ్ధి పొందిన యువ పారిశ్రామిక వేత్త దాన్ని మర్చిపోలేదు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును యువ వ్యాపారవేత్త సాత్విక్ మురారి కలిశారు. 2016 సంవత్సరంలో విదేశీ విద్యా పథకం కింద ఐర్లాండులో చదువుకోవడానికి నాటి ప్రభుత్వం సహకరించిందని వివరించారు. ప్రభుత్వ సాయంతో ఎంఎస్ అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేసి, ఇప్పుడు ఐర్లాండులో వ్యాపారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. నాడు ప్రభుత్వం నుంచి సాయం పొందిన తాను.. ఇప్పుడు విదేశాల్లో చదవాలని ఆసక్తి చూపించే పేద విద్యార్థులకు సాయం చేయాలని వచ్చినట్టు సాత్విక్ చెప్పారు. మెరిట్ కలిగిన పేద విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్ షిప్ పేరుతో ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు చెప్పారు. నలుగురు పేదలకు విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్ షిప్ అందించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సాత్విక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.