News29th Aug 10:05 AMSunil Byrisetty1 min read
63 మంది వైద్యులకు పదోన్నతి
ప్రొఫెసర్ల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 63 మందికి పదోన్నతి లభించింది. జాతీయ వైద్య సంఘం(ఎన్ఎంసి) నియమాల మేరకు వివి
ప్రొఫెసర్ల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 63 మందికి పదోన్నతి లభించింది. జాతీయ వైద్య సంఘం(ఎన్ఎంసి) నియమాల మేరకు వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్ల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నియమాలను సడలించింది. నిబంధనల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్ గా మూడేళ్లు పనిచేసిన వారు ప్రొఫెసర్ పదోన్నతికి అర్హులు. దీనిని సడలింపు చేస్తూ.. ఒక ఏడాది అనుభవమున్న అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు 11 క్లినికల్ విభాగాలు, 2 నాన్ క్లినికల్ విభాగాల్లో 63 మందిని డిపిసి(డిపార్టమెంటల్ ప్రమోషన్ కమిటీ) పదోన్నతికి సిఫారసు చేసింది. ఈవిధంగా పదోన్నతి పొందిన ప్రొఫెసర్లకు పోస్టింగులిస్తూ వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్ఎంసి నిబంధనల మేరకు మొత్తం 74 మందిని ప్రొఫెసర్లుగా ప్రమోట్ చేసేందుకు నిబంధనల్ని సడలించడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ లక్ష్యానికి చేరువగా పదోన్నతికి 63 మంది అంగీకరించడం హర్షదాయకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.