News31st Jan 04:28 PMSunil Byrisetty1 min read

జగన్ వి చిల్లర రాజకీయాలు

ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో జగన్ అలజడులు సృష్టిస్తున్నారని మంత్రి సవిత విమర్శించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నారని అన్నా

జగన్ వి చిల్లర రాజకీయాలు
ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో జగన్ అలజడులు సృష్టిస్తున్నారని మంత్రి సవిత విమర్శించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నారని అన్నారు. కల్తీ గురించి జగన్ మాట్లాడడం విడ్డూరమని, ఏ విషయంలో ఆయన కల్తీ చేయలేదో చెప్పాలని నిలదీశారు. జగన్ హయామంతా కల్తీలేనని, చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని విమర్శించారు. మద్యం కల్తీ చేసి అమామయకులు ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారన్నారు. ఉనికి కోసం, చిల్లర రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాదయాత్రకు వస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు.
Andhra Pradesh Politics
Jagan Mohan Reddy
Minister Savitha
Political Criticism
TDP
YSRCP
ఆరోపణలు
ఏపీ రాజకీయాలు
చంద్రబాబు నాయుడు
Scroll for the next article