News23rd Nov 10:33 AMSunil Byrisetty1 min read
డ్రగ్స్ వద్దు బ్రో అంటూ సైకిల్ ర్యాలీ!
విజయవాడ సింగ్ నగర్‌లో ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కుతూ ర్యాలీని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఫిట్ ఇండియాలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్
విజయవాడ సింగ్ నగర్‌లో ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.
సైకిల్ తొక్కుతూ ర్యాలీని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఫిట్ ఇండియాలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణ, విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడి యువత భవిషత్ నాశనం చేసుకోవద్దని కోరారు.
డ్రగ్స్ నిర్మూలన క్రమంలో పోలీసు శాఖతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు.
డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలను చాటుతూ ప్రజా చైతన్యం కోసం ప్రచారం చేస్తున్నామని, ఆ క్రమంలోనే సైకిల్ ర్యాలీని విజయవాడలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.