News7th Dec 04:44 PMSunil Byrisetty1 min read
గుంటూరులో డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీ
జీవితం చాలా అమూల్యమైనదని, మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వంటి తప్పు జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ హెచ్చరించారు. ఆదివారం గుంటూరు అడవి తక్కెలపాడులో "డ్రగ్స్ వద
జీవితం చాలా అమూల్యమైనదని, మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వంటి తప్పు జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ హెచ్చరించారు. ఆదివారం గుంటూరు అడవి తక్కెలపాడులో "డ్రగ్స్ వద్దు బ్రో - సైకిల్ తొక్కు బ్రో (ఈగల్)" అనే సైకిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలు, అరికట్టడానికి అమల్లో ఉన్న కఠిన చట్టాలను తెలియజేస్తూ రూపొందించిన ప్లే కార్డులు, స్లోగన్లు, పాటలు ప్రదర్శిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సరదాగా డ్రగ్స్ ను వినియోగిస్తే వారికి తెలియకుండానే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందువలన డ్రగ్స్ కు అలవాటు పడకుండా ముందస్తుగానే ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులు, యువతకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈగల్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అరికట్టడానికి పకడ్బందీగా ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తోక్కు బ్రో వంటి కార్యక్రమాలను నిర్వహించటం అభినందనీయమన్నారు.