Jobs4th Jul 12:05 PMSunil Byrisetty1 min read
క్రెడిట్ స్కోర్ బాగుంటేనే ఆర్థిక రంగంలో ఉద్యోగాలు
ఆర్థిక రంగంలోని సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఆయా సంస్థలు నియామక ప్రక్రియలో కొత్త నిబంధన జోడిస్తున్నాయి. ఉద్యోగార్థి క్రెడిట్ లావాదేవీలు సక్రమంగా ఉంటున్నాయా లేదా అనేవి తనిఖీ చేస్తున్న
ఆర్థిక రంగంలోని సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఆయా సంస్థలు నియామక ప్రక్రియలో కొత్త నిబంధన జోడిస్తున్నాయి. ఉద్యోగార్థి క్రెడిట్ లావాదేవీలు సక్రమంగా ఉంటున్నాయా లేదా అనేవి తనిఖీ చేస్తున్నాయి. అందుకోసం అభ్యర్థి క్రెడిట్ స్కోర్‌ను తెలియజేయాలని కోరుతున్నాయి. అందుకే విద్యార్హతలు, నైపుణ్యాలు ఉంటేనే సరిపోదు, ఆర్థిక క్రమశిక్షణా కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగానికి ఎంపికైన ఒక అభ్యర్థి క్రెడిట్ స్కోరు సరిగా లేని కారణంగా ఏకంగా నియామకం రద్దయింది. బ్యాంకు నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సైతం సమర్థించింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారు తమ క్రెడిట్ స్కోరును సక్రమంగా నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.