Notifications18th Aug 03:31 PMSunil Byrisetty1 min read

ఎస్బీఐలో 6,589 క్లర్క్‌ ఉద్యోగాలు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచుల్లో క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) ఉద్యోగాల భర్తీకి అర

ఎస్బీఐలో 6,589 క్లర్క్‌ ఉద్యోగాలు!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచుల్లో క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం మొత్తం 6,589 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిల్లో 5,180 రెగ్యులర్ పోస్టులు, 1,409 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 26లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డిగ్రీలో ఉత్తీర్ణత పొంది లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ఎస్‌, డీఎక్స్‌ఎస్‌ అభ్యర్థులకు ఎలంటి ఫీజు లేదు. నెలకు రూ. 24,050 నుంచి రూ.64,480 వరకు జీతంగా చెల్లిస్తారు.
SBI Clerk Jobs
State Bank of India Recruitment
Bank Jobs Notification
Junior Associate Vacancies
SBI Careers
బ్యాంక్ ఉద్యోగాలు
ఆన్‌లైన్ అప్లికేషన్
Scroll for the next article