Business Type24th Aug 03:23 PMSunil Byrisetty1 min read

100 కోట్ల నుంచి 200 కోట్లకు ఎస్బీఐ వ్యాపారం

దేశీయ ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం సాధిస్తామని ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి ధీమా వ్యక్తం చేస్తు

100 కోట్ల నుంచి 200 కోట్లకు ఎస్బీఐ వ్యాపారం
దేశీయ ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం సాధిస్తామని ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2030 నాటికి తన మొత్తం వ్యాపారాన్ని రూ. 200 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బ్యాంక్ చైర్మన్ సీ. శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ప్రస్తుత వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటే, టర్నోవర్ రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 100 లక్షల కోట్ల వ్యాపార మైలురాయిని దాటింది. భారత ఆర్థిక వ్యవస్థ 7-8% వృద్ధి చెందితే, ఎస్‌బీఐ బ్యాలెన్స్ షీట్ 11-12% వార్షిక వృద్ధిని సాధించగలదని, దీని ప్రకారం 2030 నాటికి వ్యాపారం రూ. 200 లక్షల కోట్లకు చేరవచ్చని శెట్టి అంచనా వేశారు.
Indian Economy
SBI
State Bank of India
SBI Chairman
C Srinivasulu Shetty
SBI Business
₹200 Lakh Crore
Banking Sector
ప్రభుత్వ రంగ బ్యాంకులు
బ్యాంకింగ్ న్యూస్
బిజినెస్ న్యూస్
ఆర్థిక వార్తలు
ఎస్‌బీఐ 2030 టార్గెట్
Scroll for the next article