News21st Aug 10:44 AMSunil Byrisetty1 min read
రాజధానిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయం
ప్రజారాజధాని అమరావతిలో SBI సిబ్బందికి నివాస గృహ సముదాయం నిర్మించేందుకు ముందడుగు పడింది. దీనికి సంబంధించిన భూ అగ్రిమెంట్ SBI, APCRDA మధ్య పూర్తయ్యింది. రాజధాని అమరావతిలో SBI తన ప్రా
ప్రజారాజధాని అమరావతిలో SBI సిబ్బందికి నివాస గృహ సముదాయం నిర్మించేందుకు ముందడుగు పడింది. దీనికి సంబంధించిన భూ అగ్రిమెంట్ SBI, APCRDA మధ్య పూర్తయ్యింది. రాజధాని అమరావతిలో SBI తన ప్రాంతీయ కార్యాలయాన్ని లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం పరిధిలో 3 ఎకరాలలో నిర్మించనుండగా.. కార్యాలయ నిర్మాణ పనులకు గౌరవ కేంద్రమంత్రివర్యులు నిర్మల సీతారామన్ గారు గత ఏడు నవంబర్‌లో శంకుస్థాపన చేసియున్నారు. ఈ మేరకు అమరావతిలోని SBI సిబ్బంది నివసించేందుకు వీలుగా అమరావతిలోని ఐనవోలులో 2.05 ఎకరాలలో SBI.. నివాస గృహాలను నిర్మించనుంది. దీనికై SBI, APCRDAతో తాజాగా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ప్రజారాజధాని అమరావతిని జాతీయ స్థాయిలో ఆర్థిక & పరిపాలనా కేంద్రంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే కార్యాచరణలో, ఈ అగ్రిమెంటుతో కీలకమైన ముందడుగు పడింది. రూ.214 కోట్లతో నిర్మించనున్న ఈ నివాస సముదాయంలో 4.46 లక్షల చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాతో నిర్మాణం జరుగుతుందని, జూన్ 2027లో పనులు ప్రారంభించి 2028లోపు నివాస సముదాయాలను పూర్తి చేస్తామని SBI అధికారులు తెలిపారు.