News23rd May 01:18 PMSunil Byrisetty1 min read

సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వ్యవహారాలు చూసినన సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు నిరాకరిం

సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వ్యవహారాలు చూసినన సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు నిరాకరించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు 2 వారాల గడువునిచ్చింది. ఇలాంటివి ఎవరు చేసినా తప్పేనన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పులు చేసిన వారిని వ్యవస్థ శిక్షిస్తుందని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని అనుకున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఏ ఆలోచనతో పెట్టారో ఆమాత్రం తెలుసుకోలేమా అంటూ సజ్జల భార్గవ్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
Andhra Pradesh
YSRCP
Supreme Court
Sajjala Bhargava Reddy
SC
ST Atrocity Case
సజ్జల భార్గవ్ రెడ్డి
ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు
ఎస్సీ
ఎస్టీ అట్రాసిటీ కేసు
Scroll for the next article