Education25th Aug 02:47 PMSunil Byrisetty1 min read
ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ విద్యార్ధులు
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్‌లో విజయం సాధించిన విద్యార్ధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఐఐటీ, నిట్, నీట్‌లో సీ
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్‌లో విజయం సాధించిన విద్యార్ధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఐఐటీ, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సీఎం సూచించారు. భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు... రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఐఐటీ, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన విద్యార్ధులకు మెమొంటోలు, ఒక్కో విద్యార్ధికి రూ.లక్ష చొప్పున చెక్ స్వయంగా అందించి వారితో విడివిడిగా ఫోటోలు దిగారు. మొత్తం 55 మంది విద్యార్ధులకు రూ.55 లక్షలు ఇచ్చారు. విద్యార్ధులు అంతా పేదరికం నుంచి వచ్చి ఉత్తమ ప్రతిభ చూపడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.