Telangana30th Jul 12:58 PMSunil Byrisetty1 min read
సీఎంకు తప్పిన ప్రమాదం.. విమానం సేఫ్!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవ్వాల్సిన విమానం తిరిగి టేకాఫ్ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింద
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవ్వాల్సిన విమానం తిరిగి టేకాఫ్ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానానికి తొలుత క్లియరెన్స్ రాలేదు. దీంతో ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని తిరిగి పైలట్ టేకాఫ్ తీసుకున్నాడు. 20 నిమిషాల పాటు గాల్లో రౌండ్లు వేసిన తర్వాత క్లియరెన్స్ వచ్చింది. దీంతో తిరిగి ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండింగ్ జరిగింది. రాత్రి ఎనిమిదిన్నరకు జరిగిన ఘటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు 229 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.