News24th Sep 03:28 PMSunil Byrisetty1 min read
హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటు
హిందూపురంలో చేనేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణిచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్(ఎస్సీడీపీ) మంజూరు చేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ
హిందూపురంలో చేనేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణిచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్(ఎస్సీడీపీ) మంజూరు చేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ క్లస్టర్ తో 292 మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన పేషీలో ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి హిందూపురంలో స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్(ఎస్సీడీపీ) ఏర్పాటుపై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ, రూ. 1.51 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎస్సీడీపీకి కేంద్రం రూ.1.44 కోట్లు, లబ్ధిదారులు రూ.7.12 లక్షలు వాటాగా ఇవ్వనున్నారన్నారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి) కింద కేంద్ర ప్రభుత్వం హిందూపురానికి ఎస్సీడీపీ మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, నూతన చేనేత దుస్తుల తయారీలో నిపుణులు, ఫ్యాషన్ డిజైనర్లతో నేతన్నలకు శిక్షణనిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుత తరం ఆలోచనలు, ఫ్యాషన్ ను దృష్టిలో పెట్టుకుని చేనేత దుస్తుల రూపకల్పనపై నేతన్నలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.