Politics16th Jan 04:40 PMSunil Byrisetty1 min read
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ విడుదల
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ ప్రకటించింది. సోమవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేష
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ ప్రకటించింది. సోమవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చారు. జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి డా. లక్ష్మణ్ వెల్లడించారు.