Politics14th Mar 10:07 AMSunil Byrisetty1 min read
ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి మంత్రుల కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక సిద్ధం చేసింది. ఇటీవల ఎస్సీ వర్గీకర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక సిద్ధం చేసింది.
ఇటీవల ఎస్సీ వర్గీకరణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలన చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రులు డోలా బలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, బిసి.జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ లతో ప్రభుత్వం కమిటీని నియమించింది.