News31st Jul 05:27 PMSunil Byrisetty1 min read

కనీస వేతనం రూ.26వేలు ఇచ్చేంత వరకు పోరాడతాం

రాష్ట్రంలోని అంగన్‌వాడీ, ఆశా, విఓఏ, ఆర్.పి, మధ్యాహ్న భోజన పధకం, ఉపాధి హామీ పధకం తదితర ప్రభుత్వ స్కీమ్‌లలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలి, కనీసవేతనం రూ.26వేలు ప్రభుత్వ

కనీస వేతనం రూ.26వేలు ఇచ్చేంత వరకు పోరాడతాం
రాష్ట్రంలోని అంగన్‌వాడీ, ఆశా, విఓఏ, ఆర్.పి, మధ్యాహ్న భోజన పధకం, ఉపాధి హామీ పధకం తదితర ప్రభుత్వ స్కీమ్‌లలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలి, కనీసవేతనం రూ.26వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, అవి వచ్చేంత వరకు స్కీమ్ వర్కర్లు పోరాడతారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుబ్బరావమ్మ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్కీమ్‌ల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలో భాగంగా విజయవాడలో ఎన్‌టిఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు టి.గజలక్ష్మి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.జ్యోతి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ప్రభుత్వ స్కీమ్‌లలో పనిచేస్తున్న వారంతా మహిళలే. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను, పారిశ్రామిక వేత్తలను చేస్తామని చెప్తున్నది. కానీ స్కీమ్‌ల్లో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం కనీసవేతనాలు ఇవ్వడానికి నిరాకరిస్తుందన్నారు.
Andhra Pradesh
CITU
Scheme Workers
Minimum Wage
Anganwadi Workers
ASHA Workers
Mid-Day Meal Workers
ఉపాధి హామీ పథకం
కార్మిక హక్కులు
విజయవాడ
ఏపీ వార్తలు
Scroll for the next article