News8th Jul 10:54 AMSunil Byrisetty1 min read
తమిళనాడులో ఘోర ప్రమాదం
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్య
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ప్రమాద తీవ్రత చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చెమ్మన్ గుప్పం వద్ద పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును రైలు ఢీ కొట్టింది. అయితే ప్రధానంగా రైలు వచ్చే సమయానికి గేటు వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇక రైలు ఢీకొనడంతో బస్సు 50 మీటర్ల దూరంలో ఎగిరి పడి నుజ్జు నుజ్జు అయిపోయింది.