Education10th Aug 02:15 PMSunil Byrisetty1 min read
నివేదికల కేంద్రాలుగా పాఠశాలలు
ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వాలకు మొదటి నుంచి చులకన. వారిని మేధావులు గా పేర్కొంటూ బిస్కెట్లు వేస్తారు. వారితో నానారకాల పనులు చేయించుకుంటారు. ఓటర్ల నమోదు, జనాభా గణన, కులగణన వంటి పనులు చ
ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వాలకు మొదటి నుంచి చులకన. వారిని మేధావులు గా పేర్కొంటూ బిస్కెట్లు వేస్తారు. వారితో నానారకాల పనులు చేయించుకుంటారు. ఓటర్ల నమోదు, జనాభా గణన, కులగణన వంటి పనులు చేయిస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన ప్రధానమైన విధి నుంచి తరుచూ తప్పిస్తారు. నేటి ఉపాధ్యాయులు పని భారంతో అసలు బాధ్యతకు న్యాయం చేయలేకపోతున్నారు. అసలుకంటే వడ్డీ ఎక్కువ అన్నట్లు వారికి విద్యాబోధన కన్నా ఇతర నివేదికలు తయారు చేయడంలో కాలం కరిగిపోతోంది. మధ్యాహ్న భోజనం, ఆన్లైన్ హాజరు, నివేదికలు, వాట్సప్ లో అధికారులు అడిగిన సమాచారం పంపడంతో సమయం సరిపోతోంది. ఇంకా చదువు చెప్పే సమయం ఎక్కడిది. గతంలోనూ పాఠాలపై సమీక్షలు రాసి పంపేవారు. కాని నేడు ఇతర విషయాలపై శ్రద్ధ పెడుతున్నారు. ప్రభుత్వాలు ఈ విషయంలో పునరాలోచించాలి.