TTD17th Oct 02:38 PMSunil Byrisetty1 min read
శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా శుక్రవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం జరుగనున్న నేపత్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా శుక్రవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం జరుగనున్న నేపత్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 10.30 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ ముని శంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.