TTD2nd Oct 02:09 PMSunil Byrisetty1 min read

శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని శ్రీ చ‌క్ర తిరుమంజ‌నం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారు

శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని శ్రీ చ‌క్ర తిరుమంజ‌నం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ''భాగ్‌సవారి'' ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Tirumala
Sri Venkateswara
Chakra Tirumanjanam
Brahmotsavam
Devotional Festivals
Hindu Tradition
Temple Rituals
Punyasnanam
Malaiyappa Swamy
Sudarsana Chakra
Vaikhanasa Agama
Spiritual Ceremony
Pilgrimage
Scroll for the next article