News26th May 01:48 PMSunil Byrisetty1 min read
చీకటిలోనూ చూసేయొచ్చంట!
చీకటిలోనూ చూడగలిగే ఆధునిక అద్భుతాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. చిమ్మచీకట్లోనూ గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి పలు జీవులు చూడగలవు. అదే విధంగా చీకట్లోనూ పగటి వేళల్లో చూడగలిగేలా కాలిఫ
చీకటిలోనూ చూడగలిగే ఆధునిక అద్భుతాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. చిమ్మచీకట్లోనూ గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి పలు జీవులు చూడగలవు. అదే విధంగా చీకట్లోనూ పగటి వేళల్లో చూడగలిగేలా కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు, బయోహాకర్స్ టీమ్, సైన్స్ ఫర్ ది మాసెస్ అనే పరిశోధక నిపుణులు ఐడ్రాప్స్ ఆవిష్కరణ చేశారు. ఈ ఘనత సాధించారు. క్లోరిన్ e6 (Ce6) అనే సమ్మేళనంతో ఈ ఐడ్రాప్స్‌ని రూపొందించారు. సముద్ర అంతర్భాగంలో చేపలు చూడగలిగేందుకు ఈ రసాయనం ఉపయోగపడుతుందంట. దాన్ని ఇన్సులిన్, సెలైన్‌తో కలిపి కంటిలో వేస్తే రాత్రిపూట తాత్కాలికంగా చూడవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. పరిశోధనలో భాగంగా ఈ ఐడ్రాప్ రెండు చుక్కలు వేసుకుంటే చీకటిలో సైతం164 అడుగుల దూరం వరకు స్పష్టంగా చూడగలిగినట్లు గుర్తించారు. అయితే రాత్రి నుంచి తెల్లవారు జాము వరకే ఈ ప్రభావం ఉంటోందని, నిరంతరం పనిచేసేలా పరిశోధనలు చేస్తున్నారు.