News21st Mar 09:43 AMSunil Byrisetty1 min read
3 నెలలు జాగ్రత్త: సీఎస్ విజయానంద్
రాబోయే 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సూచించారు. మార్చి ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో భగభగల
రాబోయే 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సూచించారు.
మార్చి ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో భగభగలు పెరిగిపోయాయి. ఉష్ణోగ్రతలు సైతం అధికంగా నమోదవుతున్నాయి.
దీంతో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని సీఎస్ సూచించారు.
వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముఖ్యమన్నారు.
వడదెబ్బ తాకకుండా నీటిని అధికంగా తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఈ మేరకు వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.