Business Type3rd Jul 11:11 AMSunil Byrisetty1 min read

జీఎస్టీ పన్ను మార్పులతో తగ్గనున్న ఈ వస్తువుల ధరలు

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించే యోచన చేస్తోంది. మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయంతో టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెషర్ క

జీఎస్టీ పన్ను మార్పులతో తగ్గనున్న ఈ వస్తువుల ధరలు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించే యోచన చేస్తోంది. మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయంతో టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంట సామగ్రి, ఎలక్ట్రిక్ గీజర్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు, చిన్న వాషింగ్ మెషిన్లు, సైకిళ్లు, రెడీమేడ్ దుస్తులు, ఫుట్ వేర్, స్టేషనరీ వస్తువులు, వ్యాక్సిన్స్, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాల ధరలు తగ్గనున్నాయి. ఈ విధంగా రేట్లను తగ్గించటం ద్వారా అమ్మకాలు పెరుగుతాయని ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు పెరిగి దీర్ఘకాలంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనికి అనుగుణంగానే జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు.
central government
GST tax
middle class people
Nirmala Sitharaman
stationery items
electric ironing boards
clothes
Scroll for the next article