News7th Dec 09:47 AMSunil Byrisetty1 min read
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్!
ఇటీవల వెలుగులోకి వచ్చిన స్క్రబ్ టైఫస్ ఉమ్మడి కృష్ణాజిల్లాను కలవరపెడుతోంది. కృష్ణాజిల్లాలో 15 కేసులు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో
ఇటీవల వెలుగులోకి వచ్చిన
స్క్రబ్ టైఫస్ ఉమ్మడి కృష్ణాజిల్లాను కలవరపెడుతోంది. కృష్ణాజిల్లాలో 15 కేసులు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ బారిన పడి ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన బుట్టి శివశంకర్‌రాజు మృతిచెందడం కలకలం రేపుతోంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆయన మచిలీపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. లక్షణాలను బట్టి పరీక్ష చేయగా, స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని వచ్చింది. దీనివల్లే ఆయన మృతిచెందినట్లు నిర్ధారణకు వచ్చామని వెల్లడించారు. పేడపురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుందని, కానీ చనిపోయే అవకాశాలు చాలా తక్కువని తెలిపారు. మందులు వాడితే తగ్గిపోతుందన్నారు.