Jobs31st Jul 03:24 PMSunil Byrisetty1 min read
జర్మనీలో ఉపాధికి ఉచిత శిక్షణ
SC/ST మహిళా నర్సుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. నైపుణ్యాభివృద్ధి, గిరిజన సంక్షేమం, సామాజిక సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జర్మనీలో నర్సుగా పని చేయాల
SC/ST మహిళా నర్సుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. నైపుణ్యాభివృద్ధి, గిరిజన సంక్షేమం, సామాజిక సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జర్మనీలో నర్సుగా పని చేయాలనుకునే మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ కల్పన కార్యక్రమం ప్రారంభించనుంది. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అభ్యర్థులు GNM లేదా B.Sc Nursing పూర్తి చేసినవారై, గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. GNM అభ్యర్థులకు కనీసం 3 సంవత్సరాలు, B.Sc అభ్యర్థులకు కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు €2,700/- నుండి €3,500/- (సుమారు రూ. 2.4 లక్షలు నుండి రూ. 3.1 లక్షలు వరకు) జీతం లభిస్తుంది.
శిక్షణ వ్యవధి 8 నుండి 10 నెలలుగా ఉండే ఈ కోర్సు తరగతి గదిలో రెసిడెన్షియల్ మోడ్‌లో జరుగుతుంది. అభ్యర్థులకు ఆహారం మరియు వసతి ఉచితంగా అందించబడుతుంది. వీసా, విమాన టికెట్లు, డాక్యుమెంట్ల అటెస్టేషన్, భాషా పరీక్ష మొదటి ప్రయత్నపు ఫీజును ఉద్యోగదారు భరిస్తారు. https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration లింక్‌లో నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 7వ తేదీగా నిర్ణయించబడింది.
skillinternational@apssdc.in లేదా 9676708041, 9550607888 నంబర్లలో సంప్రదించాలి.